Saturday, September 4, 2010

Plants used as Patri for Vinaayaka chavithi


వినాయకచవితి శుభాకాంక్షలతో 

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ 
అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా 
xxxx
సదా బాలరూపం లంబోదరం మహోదారం
అంబా సుతం మతంగమస్తకం కరే పుస్తకం
మూషికారూఢం ప్రశాంతేంద్రియం జ్ఞాన దీప్తం  
సర్వ విఘ్న నాశకం గణేశం ప్రణమామ్యహం
xxxx  
గజాననం భూతగణాధి సేవితం  కపిత్థ జంబూ ఫలసార భక్షిణం 
ఉమాసుతం శొకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం 
ఓం ప్రణమామ్యహం శిరసా దేవం  గౌరీ పుత్రం వినాయకం 
భక్తవత్సలం స్మరేన్నిత్యం ఆయుః కామ్యార్ధ సిద్ధయే 
వక్రతుండం, ఏకదంతం, కృష్ణ పింగళాక్షాం, గజవక్త్రం,లంబోదరం,వికటం, విఘ్నరాజం, ధూమ్ర వర్ణం, ఫాల చంద్రం, వినాయకం,గణపతిం, గజాననం -ఇతి ద్వాదశ నామాని స్మరేన్నిత్యం, న విఘ్న  భయం, తస్య కామ్యార్ధ సిద్ధిం లభతే ; ఇతినారద కృత సంకష్ట హర స్తోత్రం  

 గణేశ పంచ శ్లోకి 
1. ప్రణమామి గుణ నాయకా, భూత గణ నాయకా
చతురాక్షరజీవికా, అజ్ఞానేభ  దైత్యాంతకా,
విశ్వవిధాయకా, జ్ఞానప్రదాయకా, వినాయకా 
పాలయమాం జగదేక విఘ్న రోధక దీపికా!  

2. భజామి త్వం గజావదనా, నిర్జిత షడ్వదనా  
అయోనిజా! సదా ప్రపూజ్యా! ప్రతిబంధ నిజఘ్నీ!   
విజయ గణపతీ విద్యా పతీ వికట మూర్తీ
సముపార్జిత మాతాతాతస్య మహనీయ శక్తీ!

3. చింతితం త్వం ఏక దంతం సంతతం అచింత్య రూపం,
మతంగ మస్తకం హస్తే  పుస్తకం  మూషికారూఢం
కుంచిత తుండం  అకుంచిత పరాక్రమం, నితాంత
ద్యుతిం, ప్రశాంతేంద్రియం, వ్యాసాది పూజితం గణేశం !

4. వందే లంబోదరా! భక్త మందారా! దయా మందిరా  
భవ బంధ హరా,  వుందురు వాహనామహోదారా 
సురేశ్వరా, శూర్పకర్ణా,  కందర్పాంతక నందనా,
 దదాతు ధీశక్తి పరాశక్తి పుత్రా! సుక్ర తూయా!

5.  ప్రాంజలి సంసక్త కుంజర శీర్షా, భక్త రంజకా
ప్రజ్వలిత తేజో స్వరూపా! సురనర ప్రపూజ్యా, ద్విజా 
ఆకర్ణయతే  ప్రజార్తి,అమృతో దారా, అంబా సుతా  
ప్రదత్తే సర్వకార్య సిద్ది చతుర గణపతే! 
           
I thank all the visitors of this blog.
(revised on 27-08-2019) 
Vigneswara is the Lord of success and destroyer of obstacles to gain knowledge, wisdom and wealth.
Lord Ganesha is known from Vedic culture. He is also known as the ultimate God. We know him as the son of Parvathy, with an elephants head. He is intelligent and brave.
  He is an excellent scribe; as the great saint and poet VedaVyasa  dictates the slokas of Mahabhatha he inscribed  them on dry Borassus leaves without any break. A scribe requires good knowledge of language, concentration and physical stamina. Why should we remember Lord Vigneswara, because to learn the things perfectly, without any inhibitions. He never feels ashamed to be a scribe, his humbleness, dedication should be respected, worshiped. We have to learn to complete the tasks even though there are difficulties and hurdles, we have to remember Lord Vigneswara, and pray him to give us energy to work like him. He is a good example to boost our mental capabilities.  If everyone works like Lord Ganesha our country regains the great traditions and riches. May God Ganesha bless every one with good mental makeup.It is a festival of Nature.
కొండంత దేవుడికి కొన్ని పత్రాలతో కొండంత స్థిర చిత్తంతో చేసే పూజ శుభకరము.  పూజ కు వుపయోగించే పవిత్ర మైన మొక్కల గురించి తెలియ జేయాలన్న ఆశ తో చేసే ప్రయత్నం ఇది.చిత్రం క్రింద దాని సమాచారం సంక్షిప్తం గా ఇవ్వడం జరిగింది. పత్రిని అమ్మే వారు శాస్త్రము లో చెప్పినవి కాక వారికి దొరికినవి తెచ్చి అమ్ముతున్నారు. అటువంటి మొక్కల వలన కొన్ని రకాల అల్లెర్జిలు రావడానికి అవకాశం వుంది. 
పూజ కుపయోగించే ప్రతిమను మట్టి తో చేసినది , విషపూరిత రంగులు వేయనిదానిని పూజించండి.
 Respect our Nature. Be Eco friendly. Wish you a Happy and Healthy Vinayaka chavithi.
ఏక వింశతి  -21 పత్రాలు - పత్రి పూజ : వీటిలో విష్ణువుకు ప్రీతికరమైనవి కొన్ని, శివునికి ప్రీతికరమైనవి కొన్ని, పార్వతి మాతకు ప్రీతికరమైనవి కొన్ని వున్నాయి. కొన్ని ఔషధ మొక్కలు, కొన్ని మధుర ఫలాలను ఇచ్ఛేవి , కొన్ని విషపు మొక్కలు, కొన్ని ముళ్ళవి, కొన్ని వృక్షాలు కొన్ని చిన్న గుల్మా లు వున్నాయి . వీటి లక్షణాలను  విశ్లేషిస్తే వేదాంతము కొంత తెలుస్తుంది.
 వినాయకునికి గల ముఖ్యమైన 21 నామాలు , ఒక్కో నామము తో స్మరించినపుడు ఉపయోగించే పత్రము , దాని  Botanical name; Telugu names and photographs are provided for correct and easy identification.
1.Sumukhaya Namaha.: సుముఖాయ నమః(My salutations for a good spokesman)
Leaf used: Sanskrit name: మాచీ పత్రం- తెలుగు పేరు : దవనం
Botanical nameArtimissia pallense (Family: Asteraceae) .
It is a small aromatic herb. It is a cultivated plant. ఇది సుగంధ భరితమైన మొక్క . దనుజ వైరికి ప్రీతి కరమైనది దవనం. 
(Significance: though small and short, may not be handsome, speak with pleasantness , use sweet words without hurt, your greatness spread like fragrance)    

Artimissia .pallense (దవనం)
Plant name: (Sanskrit) Machi patram మాచీ పత్రం (Telugu)
–Botanical name: Artmisia indica (మాచ పత్రి )
Medicinal Use: Aromatic, tonic, anti malarial & digestive.
In some versions it is "Davanam", in others it is "Maacha patri" Any of these plants may be used. Both have anti insecticidal properties.
Artmisia indica/ A.vulgaris మాచ పత్రి 
2.Ganaadhipaya Namaha : గణాధిపాయనమః(My salutations to Head of Ganas)
Leaf used: : Brihatipatram, బృహతీ పత్రం(Sanskrit) (Telugu లో Vakudu -వాకుడు, నేల ములగ /నేల వంకాయ/ వెర్రి  వంగ / వార్తకి / చల్ల ములగ  అనికూడా అంటారు )
Botanical name: Solanum surettense/ Solanum xylocarpum (Family: Solanaceae)
An armed shrub found in waste places.ఇది అన్ని భాగాలపై ముళ్ళను కలిగి ఉంటుంది . ఆయుర్వేదం లో దీన్ని దశమూలాల్లో ఒకటి గా చెప్తారు . ఇది నేలపైన సమాంతరంగా పరుచుకొని పెరుగుతుంది; దీని కాయలు  చిన్న వంకాయల వలె  పసుపు పచ్చగా ఉంటాయి. తీగలాగా పెరిగి ఎర్రటి కాయలనిచ్చే ది ఇదీ వేరు.     
Medicinal Use: In Ayurveda it is used to manage edema, worm-infestation, skin diseases, indigestion and as diuretic.
(Significance: to handle the army one should be harsh outward, should be armed in all aspects to prevent the enemy- like this spiny plant)
Solanum surattense
3. Gowriputraya Namaha/ Umaputraaya namaha:ఉమాపుత్రాయనమః  : గౌరీ పుత్రాయనమః(My salutations to the Son of Goddess Gauri or Uma )
Leaf used:  (Sanskrit) Bilvapatram బిల్వ;  (Telugu -Maredu  మారేడు)
Botanical name: Aegle marmelos (Family: Rutaceae)

Medicinal Use: Leaves, fruit, stem and roots of this tree at all stages of maturity are used as medicine against various human ailments; such as asthma, anemia, fractures, healing of wounds, swollen Joints, high blood pressure, jaundice, diarrhea, and typhoid and for the management of diabetes mellitus in Ayurveda. Fruit pulp is used as coolant, to control loose motions, and in gastric problems.
Commonly found in temples.శివాలయాల్లో  తప్పనిసరిగా ఉంటుంది; ఇపుడు ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు . ముళ్ళున్న పెద్ద చెట్టు.    
(Significance: Gowri means pure white or knowledge; son of knowledge is also knowledgeable; one should be strong in three ways; in Mythology this tree is said to be arise from the sweat of Goddess Parvathi, hence it is dear to lord Shiva. Uma is the short form of Om (అ+ఉ+మ) బిల్వ పత్రం లోని మూడు దళాలు త్రిగుణాలకు , త్రిలోకాలకు, సృష్టి స్థితి లయ కు ప్రతీకలు గా , భావిస్తారు.  )
Aegle marmelos మారేడు 
4. Gajananaya Namaha: గజాననాయనమః(My salutations to Elephant faced god)
Leaf used:  (Sanskrit) Durvara patraదూర్వార; (Telugu)Garika గరిక 
Botanical name:  Cyanodon dactylon (Family:Poaceae) All grasses are not garika. this is small grass found in fields.   
Beware of other grasses; It is often replaced by darbha/ Imperita or some times by Typha in Patri. They cause mild allergy.
దర్భ వేరు గరిక వేరు ; దర్భ విష్ణువుకు ప్రీతీ కరమైనది . దర్భ గడ్డిని ఆసనము గా, వైదిక క్రతువులో దీనిని చేతిలో ఉంచుకుని తర్పణము ఇస్తారు. దర్భ ఆకు మొనదేలి ఉంటుంది.
 గరిక చిన్నదిగా వుంది మృదువుగా ఉంటుంది .వినాయక పూజకుగరిక ను వాడాలి. 
Medicinal Use: Tender leaves are used as leafy vegetable; it is used in biliousness, vomiting, burning sensation, hallucinations, fever, chronic diarrhea and dysentery, ophthalmia and in skin diseases.
(Significance: An elephant is a herbivore, with small grass like devotion we can win elephant like large god; in mythology it is said to have arise from the hair of Prajapati)

గరిక Cyanodon dactylon
5. Harasunve Namaha: హరసూనవేనమః(My salutations to Son of Lord Hara-Shiva)
Leaf used: (Sanskrit)Dattura ptra (Telugu)ఉమ్మెత్త
 Botanical name : Datura metal or D.stramonium either can be used(Family:Solanaceae) 
A herb in waste places.flowers large, white or pink, fruit spiny. The leaf, flower and seed are poisonous. తెల్లని లేదా ఊదా రంగు పెద్ద పూలతో ముళ్ల కాయలతో వుండే చిన్న చెట్టు , విషపూరితం 
Medicinal Use:It is used to treat asthma, cough, rheumatism, muscle pain and dog bite.
(Significance: As lord Shiva bear poison in his throat this plant also have poisonous seeds, in some hallucination Shiva be headed Ganesh and after knowing that he is the creation of Goddess Parvathi his wife he gave rebirth to him by adhesing the head of an elephant )
Datura metal ఉమ్మెత్త 
6Lambodaraya Namaha: లంబోదరాయనమః(My salutations to god with a descending stomach)
Leaf used: (Sanskrit)Badari patra బదరీ పత్రం;  (Telugu-Regu రేగు ; 
Botanical nameZizyphus mauritiana/ Z.jujba(Family:Rhamnaceae)
Medicinal Use: Fruits are eaten fresh or dried; they are astringent, cooling, stomachic, styptic, and laxative. Bark is used in bone fracture.The purified resin makes the high-quality shellac.  Habitat: An armed shrub in forests or in waste places.చిన్న ముళ్ళుండి పొదలాగా పెరుగుతుంది 
Mythological significance: When Lord Vishnu undergoing a great penance at Himalayas, Badri Vriksham gives shade to him. Hence it is considered as sacred tree.It is said to have admnistered by "Ashwani devathalu" the divine doctors used this fruit for strength)
రేగు Zizyphus jujuba
7. Guhagrajaya Namaha: గుహాగ్రజాయనమః(My salutations to the elder brother of Karthikeya or the superior hearted)
Leaf used: (Sanskrit)Apamarga patraఅపామార్గ, (Telugu)Uttareni  ఉత్తరేణి  -
Botanical name Achyranthes aspera (Family:Amaranthaceae)
 Medicinal Use:The plant is useful in eye and liver complaints, rheumatism, scabies and other skin diseases. The branches are used as tooth brushes. Decoction of whole plant is diuretic and used in renal dropsy. Root is used for scorpion bite. the leaf is cooked as leafy vegetable) 
Habitat: A herb found in waste places.దీనికి పొడవైన ముళ్లవంటి చిన్న పూలున్న కాడలు కొమ్మల చివర ఉంటాయి . రోడ్లవెంబడి కలుపు లాగ పెరిగే చిన్న చెట్టు 
Mythological significance: The dried stems and seed are used in "Homas" especially in Raajasuya yaagam; it is believed this plant diverts the enemies from us, hence apaa maarga; it is by his intelligence he won the race ahead of his brother Karthikeya)
ఉత్తరేణి Achyranthus aspera
8Gajakarnaya Namaha: గజ కర్ణాయనమః(My salutations to Elephant eared god)
Leaf used: (Sanskrit)Tulasi (Telugu)Tulasi తులసి -
Botanical name: Ocimum sanctum (Family:Lamiaceae) 
 Medicinal Use:The leaves are used to manage common cold, teeth ache, skin problems like eczema, earache. It is widely used in home remedies.Anti kapha, to control skin and respiratory diseases. The dried stems are made into beeds, a chain made of these beeds is considered as auspicious. 
 A sacred herb grown in house holds and temples
Significance in Mythology: Vrinda a synonym to Tulasi. Tulasi is regarded as a great worshipper of the god Vishnu. This plant is also considered as a manifestation of  Goddess Lakshmi. It is only during Vinaayaka Chavithi Thulasi is used to worship Lord Vigneswara.
Ocimum sanctum తులసి 
9. Ekadantaya Namaha: ఏక దంతాయనమః(My salutations to the god with one teeth)
Leaf used: (Sanskrit)Chuta patra (Telugu)Mamidi చూత పత్రం, మామిడి -
 Botanical name : Mangifera indica (Family:Anacardiaceae) 
Medicinal Use: Fruits are edible;flowers are used in diarrhea, chronic dysentery and chronic urethritis. Extracts of bark, leaves, stem and unripe fruits are used as antibiotics for many ills;tender leaves are considered anti diabetic.
 Found in cultivation, also in forests.
Mythological significance: Perfectly ripe mango is often held by Lord Ganesha as a symbol of attainment, regarding the devotees' potential perfection. Mango blossoms are also used in the worship of the goddess Saraswati. Mangoes are considered favourite fruits to Goddess Parvathi. In the war with demons Lord Ganesh broke one of his teeth, to regain the energy mango is needed. ) 
Mango మామిడి 
10 Vikataya Namaha: వికటాయ నమః (My salutations to the god Who have changed the shape; Great/ powerful)
Leaf used: (Sanskrit)Karaveera patraకరవీర పత్రం, (Telugu)Genneru  గన్నేరు 
Botanical name: Nerium oleander Syn. Nerium indicum(Family:Apocyanaceae)
Some versions indicated that Nerium indicum should be used  as it is an Indian plant. Where as Cascabela thevitia is a native of S.America. Both belong to the family Apocyanaceae. Both are poisonous.
Medicinal Use:Diuretic, for heart diseases,poisonous in high doses A shrub found in siva temples.
Mythological significance: When he was beheaded by Shiva he was blessed with an elephant head to regain his life; his shape was thus changed or deformed; the leaves are very poisonous; it is resistant to dry conditions; hence we must withstand like this plant in spite of difficulties. The flower is sacred to Lord Shiva and is offered to the deity. It is also offered to Goddess Parvathy.)

Nerium indicum గన్నేరు 
11. Bhinnadantaya Namaha: భిన్న దంతాయనమః(My salutations to the god with different lengthed teethed)
Leaf used: (Sanskrit)Vishnukrantham (Telugu)Vishnukrantham విష్ణు క్రాంతం 
Botanical name: Evolvulus alsinoides (Family: Convolvulaceae)
నేలమీద పరుచుకొని పెరిగే చిన్న మొక్క దీని నీలి పువ్వులే దీని అందం 
 Medicinal Use:Improves memory, used for nurological diseases ) A herb in waste lands.
Significance: the flowers are blue like the glow of Lord Vishnu, Vishnu  means who dispersed in the entire universe, hence the sky and oceans are blue the lord is also blue)
Evolvulus alsinoides  విష్ణు క్రాంతము
12. Vatave Namaha: వటవేనమః(My salutations to a cipher)  
Leaf used: (Sanskrit)Dadimi patra (Telugu)Danimmaదానిమ్మ
Botanical name: Punica granatum (Family:Punicaceae)
Medicinal Use:To control motions, controls bleeding,anti pitta A cultivated shrub
Significance: it yields a dye, he is the scibe for Veda vyaasa to write Mahabhaaratha, for strength and stamina this fruit is used, it is nutritive hence it is offered)
Punica granatum  దానిమ్మ
13. Sureswaraya Namaha: సురేశ్వరాయనమః(My salutations to supreme of deities)
Leaf used(Sanskrit)Maruvaka patr (Telugu)Maruvam మరువం 
Botanical name: Origanum majorana (Family:Lamiaceae)
Medicinal Use:For Rhumatic diseases and skin diseases  Cultivated aromatic herb.
Significance: For the supreme lord I offer this pleasant smelled leafy herb ; unless a leader has pleasant qualities he may not win the hearts of his followers)
Origanum majorana మరువము
14. Phaalachandraya Namaha: ఫాల చంద్రాయనమః(My salutations to the  God with moon like forehead or who bears moon on his forehead)
Leaf used: two texts available one is gandakiGandaki గండకీ , గందరి అంటే telugu  లో చెఱకు, దేవ కాంచనం అని అర్ధములున్నాయి , అందువలన చెఱకు తో పూజించుట సమంజసము(As per Sanskrit dictionary gandaki means having lumps/ nodes with juice ; hence it is appropriate to use Sugarcane)
another text (Sanskrit)Jambeeraజంబీర  (Telugu)Gajanimma గజనిమ్మ 
Botanical name -Citrus limonium (Family: Rutaceae)
Medicinal Use:Digestive  A tree cultivated for its fruits.
Significance: He is so pleasant like moon for such pleasant god we offer sweet tasted sugarcane to bless us with sweet fruits in all walks in life)
Citrus limonium పెద్ద నిమ్మ
గండకీ Saccharum officinarum
  15. Sarveswaraya Namaha: సర్వేశ్వరాయనమః(My salutations to the God for all)
Leaf used(Sanskrit)Devadaru  (Telugu)Devadaru-దేవ దారు 
 Botanical name -Cedrus deodar (Family:Pinaceae) This plant is found in Himalayas only; hence in South India an alternative is used.https://en.wikipedia.org/wiki/Cedrus_deodara 
Medicinal Use:For Skin diseases, anti pyretic.In South India where Cedrus is not available, Erytroxylum is used . It is available in scrub forests.
Cedrus and Erythroxylum have fragrant wood) 
Erythroxylum monogynum దేవదారు 

16. Herambhaya Namaha: హేరంభాయనమః(My salutations to a boastful hero)
Leaf used: (Sanskrit)Sindhuvara patramసింధువార పత్రం ;(Telugu)Vavili-వావిలి 
Botanical name: Vitex nigundo (Family: Verbinaceae)
Medicinal Use: Anti vata, relieve pains in muscles and joints.
A shrub cultivated as a hedge plant or run wild in waste places
Vitex nigundo వావిలి
. 17. Surpakarnaya Namaha: శూర్పకర్ణాయనమః(My salutations to a winnowing basketed eared god like elephants ears)
Leaf used: (Sanskrit)Jaji patram (Telugu)Jaji.జాజీ 
Botanical name : Jasminum angustifolium (Family : Oleaceae)
Medicinal Use:For skin diseases
  A twiner in forests
Significance: It is with pleasant odour, it is liked by Parvathi, and Lord Shiva 
Jasminum angustifolium జాజి
18. Ibhavaktraya Namaha: ఇభ వక్త్రాయనమః(My salutations to Elephant faced god )
Leaf used(Sanskrit)Shami patramశమీ ; (Telugu)Jammiజమ్మి 
for image clic
https://www.flickr.com/photos/45835639@N04/5453607818/in/dateposted/
Botanical name: Prosopis cineraria (L.) Druce,
 Syn. Acacia spicigera (Family: Fabaceae/Mimosaceae)
Medicinal Use:Pacifying, digestive  A small tree in forests or found in some temples.
Significance in Mythologythe god of fire- Agni hid in the heart of the Shami tree to escape from the wrath of Brighu Maharishi.Shami Tree also represents goddess Durga. This tree is also worshiped by Lord Sri Ram. The wood was used to kindle the sacred fire during Vedic times. Shamipuja – the worshipping of the Shami tree finds mention in both Ramayana and the Mahabharata. 
शमी शमयते पापम् शमी शत्रुविनाशिनी ।
अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी ॥
करिष्यमाणयात्राया यथाकालम् सुखम् मया ।
तत्रनिर्विघ्नकर्त्रीत्वं भव श्रीरामपूजिता ॥



Prosopis cineraria జమ్మి 
19. Vinayakaya Namaha: వినాయకాయనమః(My salutations to lord Vinaayak a great leader)
Leaf used:  (Sanskrit)Aswatha patram అశ్వత్థము(Telugu)Ravi రావి ,  –It is also known as peepal tree, Bhodhi tree.
Botanical name: Ficus religiosa (Family: Moraceae )
Medicinal Use:Digestive ,enhances reproductivity,pacifying ) A tree found in temples especially in Vishnu temples
Significance in Mythology: River Sarswathi is said to be arised from the roots of this tree. It is considered as manifestation of Lord Vishnu. Many sages meditate under this tree.
Lord Budhha attained his spiritual knowledge (Gnana) under this tree; the tree is still seen in Gaya town of Bihar. When this tree unites with Margosa tree the pair is considered as auspicious and worshipped as Lord Vishnu and Lakshmi. This tree is said to have an embodiment of knowledge, hence a great leader should have good knowledge, hence we offer
రావి Ficus religiosa
20. Surasevitaya Namaha: సుర సేవితాయనమః(My salutations to the god who served by deities)
Leaf used(Sanskrit)Arjuna patra (Telugu)Tella maddi.తెల్ల మద్ది -
Botanical name :Terminalia arjuna(Family: Combritaceae)
Medicinal Use: The decoction of bark is a tonic in heart diseases. 
Habitat: Cultivated along roadsides ; Naturally found in forests
Mythological significanceThe tree bears the same name as Arjuna, the warrior hero of the epic Mahabharata. Arjuna in Sanskrit means ‘white’. This refers to the white coloured bark of the tree.
According to the Bhagavatha Purana, Nalakuber and Mangriva, the sons of Kubera were cursed to turn into the Arjun tree by Narada. After about 100 years, the two were relieved of the curse by Lord Krishna.It is described in many Puranas, as favourite tree to dieties.
Lord Shiva is compared to this tree, his colour is white like the bark of this tree; a leader should be pure and shine in white hence this tree) 
Terminalia arjuna తెల్ల మద్ది
21. Kapilaya Namaha: కపిలాయనమః(My salutations to the god who shines like sacred fire in reddish colour)
Leaf used: (Sanskrit)Arka patramఅర్క  (Telugu)Jilledu-జిల్లేడు 
Botanical name: Calotropis gigantia (Family: Asclepiadaceae)
Medicinal Use:Anti poisonous, anti vata
Habitat:  A shrub in waste places
Mythological significance: It is related to Lord Sun(Arka means Sun), and Shiva is also fond of the flowers of Calotropis. The woody root is used make Lord Ganesh idols, which are considered as auspicious. It is said the plant arise from hot milk carried by Angirasa etc rishis, it generates heat in the body, withstand heat. he shines like Lord Surya/ Kapila  
Calotropis gigantia జిల్లేడు


వెలగ
Note:There may be some differences in the texts, in some texts instead of Jambeera patram, gandaki patram is given. the names and order is also slightly different. I have followed the text published by TTD book "sacred plants:
While collecting the leaves for Vinayaka puja, some precautions have to be observed.పత్రి సేకరించే టప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి 
Ganneru is a poisonous plant, swallowing of 1-2 leaves may lead to death in children.గన్నేరు ఆకులు విషము ; పిల్లలు నోటిలో పెట్టుకోకుండా చూడండి 
 Seeds of Datura are also poisonous, the fruits are spiny, warn your children while enjoying the festival;ఉమ్మెత్త విత్తనాలు కుడా విషయుతమే . కాయల ముళ్ళు గుచ్చుకోకుండా చూడండి 
The latex of Calotropis is a ophthalmic poison, without any irritation the eye sight is lost if the milky liquid contacts with  the eyes. Observe your children, and tell them not put the hand in your eyes unless washed with soap. Till today there is no cure for this poisoning.
ఇక జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే చూపు కోల్పోతారు .కాబట్టి చేతులు కళ్ళల్లో పెట్టుకోకుండా చూడండి . చాలామంది తెలియక చూపు కోల్పోతున్నారు , జాగ్రత్త 
Ziziphus-regu, Maredu, vakudu are spiny plants, they may hurt you.
రేగు, వాకుడు, మారేడు యివన్నీ ముళ్ళ చెట్లు , ముళ్ళు కళ్ళలో గుచ్చుకోకుండా చూడండి 
 Lord Ganesha is a God of intellect. He indicates that in this world there are good and bad  persons around us like  tulasi, garika like non-poisonous plants and jilledu to ummetta like poisonous plants; but all are useful in some way;  "I consider all in similar way; learn how to deal with people like these thorny or poisonous plants and get the best from them". Good wishes.
ప్రపంచములో మనచుట్టూ విషపు మొక్కల వంటి వారు, ముళ్ళ చెట్ల వంటి వారు, తులసి వంటి పవత్రమైన మంచి వారు వుంటారు , భగవంతుని దృష్టి లో అందరూ సమానమే , అందరిలో ఎంతో కొంత మంచి వుంటుంది , ఎవరి తో యెట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడం కూడా తెలుస్తుంది . మన మొక్కల విలువ తెలుస్తుంది. 

వినాయకుడికి వెలగ పండు ప్రీతి కరమని భావిస్తారు. కానిదీన్నిపత్రి లో ఉపయోగించరు Since the patri sold in the market contains some weeds which are allergic to humans; Eg. Instead of machipatram, Pitchimachapatri or the congress grass – Parthenium hysterophorus is sold.
Celebrate the festival in an environmentally friendly way. Since I am a Botany lecturer I have provided the images I got from my camera. This is to educate the unconcerned people on Nature.
Whenever you handle poisonous plants be careful, never put your fingers or hand in the eyes or rub your eyes with the plant sap.
విఘ్నేశ్వరుడు అందరికి  సద్భుద్ధిని, శక్తిని, శుభాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తూ ...  శుభాకాంక్షలతో, withbest wishes

Monday, May 31, 2010

పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత

పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత . The following are some of the sacred flowers described in our ancient literature. They are used for worship in temples and in many houses throughout India.
ఈ పుష్పాలకు సువాసన తో బాటు ఔషధ గుణములు కూడా వున్నవి .బజారు లో దొరికేవి కొన్ని. పూర్వము అడవులలో నుండి సేకరించి / తోటలలో పెంచి పూజకు ఉపయోగించే వారు. చాలా మందికి బంతి ,చేమంతి, జాజి,మల్లె, గులాబీ, సంపెంగ, పద్మము, కనకాంబరం తెలిసినంతగా ఇతర పుష్పాలను కూడా వాడ వచ్చని తెలియదు. అందువల్ల ఈ వ్యాసము ఒక చిన్న ప్రయత్నము raama shree raama 
1. పద్మము, (Lotus): దీన్నే తామర(తెలుగు)కమలము, అరవిందము, నళినము, సరోజము, వారిజము, అని కూడా అంటారు.పుండరీకము, కల్హారము,అంటే తెల్లని పద్మము అని అర్ధము. ఇది విష్ణువు కు, లక్ష్మి కి ప్రీతి పాత్రము.
Botanical name: Nelumbo nucifera Gaertn., Family: Nelumbonaceae
Lotus పద్మము 
2. కదంబము/ కడిమి : Botanical name: Mitragyna parvifolia (Roxb.) Korth., Neolamarckia cadamba (Roxb.) Bosser,ఈ రెండు వృక్షాలు కదంబముగా పిలవ బడుతున్నాయి . వ్యాసుడు, మహాకవి కాళిదాసు, శంకర భగవత్పాదులు  పార్వతినికదంబ వన వాసిని , కదంబ ప్రియ  గా వర్ణించారు.    ఈ చెట్లు  అడవిలో  సహజం గా పెరుగుతాయి . పుష్పాలు  సువాసన భరితం గా ఉంటాయి.
Mitragyna / కదంబ 

కదంబ /Neolamarkia 
   3.జపా పుష్పం: మందారం Botanical name: Hibiscus rosa-sinensis ; Family: Malvaceae
 ఈ పుష్పాలను కాళికా మాతకు , శివుడికి  ప్రీతి పాత్ర మైనవి గా వర్ణించారు. అంగారకుని జపా పుష్ప వర్ణము కల వాని గా వర్నిస్తారు. జిల్లేడు,మరికొన్ని పుష్పములను కూడా మందారము అని వర్ణించడం జరిగింది.Bauhinia purpurea L.,Bauhinia variegata L., Bauhinia tomentosa L., వీటిని కూడా మందారము / దేవకాంచనము/ మోదుగ  అంటారు. 
"మందార గంధ సంయుక్తం, చారు హాసం ..... అని కృష్ణుని,మందార గంధ యుతం అని అమ్మ వారిని వర్ణించారు. 
పార్వతిని "మహతీ మేరునిలయా మందార కుసుమ ప్రియా "అని వర్ణించారు 
Bauhinia purpurea మందారము

జపా పుష్పం 
4. నీలోత్పలము : నల్ల/నీలి కలువ: Indian blue water lily, Indian water lily (Eng.);
కృష్ణుని కొందరు కవులు  నీలోత్పల ద్యుతి(నీలి కాలువ వంటి వర్ణము /కాంతి)  గల వాని గా వర్ణించారు . దుర్గా దేవి పూజ కు, నారాయణుని పూజకు విశేషంగా వాడతారు .  
Botanical name: Nymphaea nouchali Burm.f., syn. Nymphaea stellata Willd.

నీలి కలువ 
5. కుందము: అడవి జాజి: Botanical name: Jasminum auriculatum Family: Oleaceae  కాళిదాసు  పార్వతి పలు వరుస కుందముల వలె ఉన్నవని వర్ణింప బడినది.సరస్వతి మల్లె వలె తెల్లని వర్ణము కలిగినదని వర్ణించ బడినది.   ఇవి దేవి పూజకు వాడబడుతున్నాయి.  వాసంతి, మాగధి, మొల్లలు అనికూడా పిలుస్తారు. ఇవి సుగంధ భరితము. 
Jasminum sambac (L.) Aiton, మల్లె, నవమల్లిక ఇవి మనము విరివిగా వాడే , బజారులో దొరికే మల్లె పూలు. Jasminum angustifolium (L.) Willd., అడవిమల్లె,సిరిమల్లె,  శ్రీమల్లె ఇవి కూడా అడవులలో దొరుకుతాయి. సుగంధ భరితము, ఈ మల్లె జాతులన్నీ దేవుని పూజకు ఉపయోగించ వచ్చు     
కుందము 
6. బంధూక పుష్పము :   మంకెన  పువ్వు : సూర్యాష్టకం లో-బంధూక పుష్ప సంకాశం - హార కుండల శోభితం ; మహా పాప హరం......   తం సూర్యం ప్రణ మామ్య హం   సూర్యుని వర్ణము బంధూక పుష్ప వర్ణము గా వర్ణించారు.
  Botanical name:. Pentapetes phoenicea L.,Family: Malvaceae
Ixora coccinea L., Family: Rubiaceae దీనిని రామబాణం, నూరువరహాల పూలు అంటారు, దీనికే మంకెన, బంధూకము అనే పేర్లు కూడా వున్నాయి. కావున వీటిని కూడా ఉపయోగించ వచ్చు. ఎర్రని రంగు కలిగిన పుష్పాలను కొందరు మంకెన పూలు గా వ్యవహరిస్తారు. 
లలితా దేవిని "బంధూక కుసుమ ప్రఖ్యా "అని, "జపా పుష్ప నిభా కృతి"అని   వర్ణించారు  
Ixora coccinea మంకెన పూలు 
  
మంకెన/ బంధూక  పువ్వు 
7. అతశీ : Botanical name: Linum usitatissimum, Family: Linaceae,  also known as Flax plant.  Seed are rich in omega-3 fatty acids; fiber is used weave coarse cloth. కృష్ణాష్టకం లో అతశీ  పుష్ప సంకాశం  హార నూపుర శోభితం --- కృష్ణం వందే జగద్గురుం- వాసుదేవుడి అతశీ పుష్ప వర్ణం లో వున్నా డని  వర్ణించారు. ఇవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సహజం గా కనిపించవు. చల్లని ప్రదేశాల్లో పెరుగు తాయి .   
అతశి పుష్పం 
8.వకుళ లేదా పొగడ: Botanical name: Mimusops elengi L., Family: Sapotaceae
 ఈ పుష్పాలు విష్ణువు కు ప్రీతి కరము. సుగంధ భరితము.  కృష్ణుడు బృందావనం లో ఈ పూల సుగంధమును ఇష్ట పడే వాడని వర్ణించ బడినది. విష్ణు పూజకు వాడతారు.తిరుమల లో వెంకటేశ్వర స్వామికి కూడా ఈ పొగడ పూల మాలలు వేస్తారు .
వకుళ /పొగడ 
9. మాలతీ:  Botanical name: Aganosma cymosa Family: Apocynaceae;బృందావనం లో కృష్ణుని అలరించిన తీగ  పుష్పాలు. సుగంధ భరితం. ఇవి మల్లెల్లాగే తెల్లగా సుగంధ భరితం గా ఉంటాయి. అడవుల్లో పెరుగుతాయి.    
మాలతి 
 10. మాధవి : Botanical name: Hiptage benghalensis(L.) Kurz, వీటి కాయలకు 3 రెక్కలుంటాయి, అందువల్ల వీటిని పావురాయి  కాయలని కూడా అంటారు .  బృందావనం లో కృష్ణుని అలరించిన తీగ  పుష్పాలు. అడవుల్లో సహజం గా ఉంటాయి .సుగంధ భరితం.   
  
మాధవీ లత 
11. చంపకము: Botanical name: Magnolia champaca (L.) Baill. ex Pierre,
 ఈ పుష్పాలు విష్ణువుకు పార్వతి కి ప్రీతి పాత్రము. సుగంధ భరితము. వీటిని చాంపేయము, సంపంగి పూలని కూడా పిలుస్తారు. వీటిని పూజకు విరివిగా ఉపయోగిస్తారు.     
చంపకం 
12. సేవంతిక: Chrysanthemum indicum , చేమంతి పూలు
13. పారిజాతము : Nyctanthes arbor-tristis L.,  పొగడ, సేపాలిక, అని కూడా పిలుస్తారు.   
పారిజాతం 
13. అర్క(జిల్లేడు) : Botanical name: Calotropis giganteaశివునికి అర్కముడు అనే పేరు కూడా వున్నది, సూర్యునికి కూడా అర్కుడు అని పేరు.  తెల్లని పూలు గలవి శ్రేష్టము ఈ పూలను గణపతి, శివ, సూర్య పూజకు మాత్రమే వాడతారు . రధ సప్తమి నాడు సూర్యారాధనకు వాడుతారు.   విష్ణు ఆరాధనకు ఉపయోగించరు.దీని కర్రతో గణపతి విగ్రహాన్ని చేసి పూజ చేస్తారు
ఆర్క/జిల్లేడు  
 15. పలాశ: కింశుక / మోదుగ: Botanical name: Butea monosperma  దీని పుష్పాల తో హోళీ రంగులు చేసి ఆడుకుంటారు . దీని శాఖ తో చేసిన కర్రను ఉపనయనము సమయం లో వాడతారు .వీటిని మన్మధుని గోర్లు అని కూడా అంటారు.
పలాశ 
  16. ద్రోణ: తుమ్మిపూలు; Botanical name: Leucas aspera ; వీటి పూలను కార్తీక మాసం లో మాస శివ రాత్రి , సోమవారం, ఆర్ద్ర నక్షత్రం వున్న రోజుల్లోశివ పూజకు ఉపయోగిస్తారు. వీటి ఆకును ఆకు కూర గా వాడతారు. విష్ణు పూజకు ఉపయోగించరు.
ద్రోణ / తుమ్మి 
17. అశోకము :  ఈ చెట్టు కింద నే సీతమ్మ వారు రావణుడి చెర లో  వుండినదని రామాయణం లో వర్ణించ బడినది. దీనికి వంజులము అని మరియొక పేరు.  ఇది శోక నాశకము గ భావిస్తారు. వీటి పూలను అమ్మ వారి పూజకు వాడతారు. లలితా దేవిని "చంపకాశోకపున్నాగ సౌగంధికా లసత్కచా "అని వర్ణించారు (she decorated her hair with Champak, Ashoka, Punnaga and Sougandhika flowers)
 Botanical name: Saraca indica, Family: Fabaceae
అశోక వృక్షం 
18. మామిడి/చూతముBotanical name: Mangifera indica Family: Anacardiaceae
హిందువుల ఇళ్ళలో మామిడి ఆకులు లేకుండా ఏ పండుగను కానీ శుభ కార్యమును గానీ ఊహించలేము. ఇది అతి పవిత్రమైన వృక్షము. దీని ఆకులనే కాక పుష్పాలను కూడా సరస్వతీ దేవి, వినాయకునికి , లక్ష్మీ పూజకు వాడతారు.
Mangifera indica మామిడి 
18.  వేప:Botanical name: Azadirachta indica Family: Meliaceaeదీనిని నింబ వృక్షము అని కూడా అంటారు.  వేప పూలను తెలుగు వారు ఉగాది నాడు వాడతారు . వేప చెట్టు ను లక్ష్మీ స్వరూపం గా పూజిస్తారు.  గ్రామ దేవతల పూజలకు ఉపయోగించడము అందరికి తెలిసినదే .
19. కేతకి :దీన్నే మొగలి పూవు అని కూడా అంటారు.
Botanical name: Pandanus odorifer Family: Pandanaceae 
దీన్ని శివ పూజకు తప్ప మిగిలిన దేవతారాధనకు వాడతారు. శివ లింగము ఆది అంతము చూచానని అబధ్దము చెప్పడం వలన పూజకు పనికి రాకుండా పోయింది.
కేతకి , మొగలి పువ్వు 
20. పున్నాగ : దీన్ని పొన్న అనికూడా అంటారు.
Botanical name: Calophyllum inophyllum L., Family:Calophyllaceaeతెల్లని సుగంధ భరితపుష్పాలు ఉంటాయి. వీటిని శివ పార్వతుల పూజకు, విష్ణు పూజకువాడతారు.
పున్నాగ/పొన్న  
21. పాటల/ పాటలీ/కలిగొట్టు పుష్పము:Botanical name:Stereospermum tetragonum DC.,Family: Bignoniaceae 
శివ పార్వతుల సమాగమము ఈ చెట్టు కింద జరిగినదనిపురాణములలో వర్ణించ బడినది.అందువలన పసుపు రంగు కల ఈ పుష్పము లుశివపార్వతుల కు ప్రీతి పాత్రము.
లలితా పరమేశ్వరి  "దురా రాధ్యా , దురా ధర్షా పాటలీ కుసుమ ప్రియా "అని కీర్తించ బడింది  
పాటల /కలిగొట్టు 
22. కరవీరము/ఎర్రగన్నేరు/కస్తూరిపూలు:Botanical name: Neerium indicum L.,
వీటిని శివ, పార్వతి, వినాయక పూజకు వాడతారు.  
  
 23. దేవకాంచనము/అడవి గన్నేరు/ దేవ గన్నేరు అనికూడా అంటారు.Botanical name: Plumeria alba (తెల్ల పూలవి), Plumeria rubra(ఎర్ర పూలవి). 
దేవ కాంచనం 
24. మధూకము: దీనినే ఇప్ప/ విప్ప అంటారు. వీటిని పూజకు వాడక పోయినా, ఎండిన పూలను తేనెతో కలిపి  భద్రాచలం వంటి కొన్ని దేవాలయాల్లో ప్రసాదం గా వాడతారు.ఇవి తియ్యగా ఉంటాయి. 
    Botanical name:  Madhuca longifolia(J.Koenig ex L.)J.F.Macbr, 
Madhuca flowersఇప్పపూలు 
కనకాంబరం, జాజి, గులాబీ , నందివర్ధనం, గన్నేరు,
లింగాక్షతలు/ చిలకముక్కుపూలు,
గిరికర్ణికా-అంటే శంకు పుష్పాలు: Botanical name: Clitoria ternatea L., 
శంకు పుష్పము 
 దేవకాంచనము,  వంటి సుగంధ భరిత పుష్పాలను వాడతారు.
  నాగ కేసరము: Mesua ferrea L.,
నాగ కేసరము Mesua ferrea

 శివలింగం పూలు: 
Couropitta guinensis శివ లింగం పూలు 


బంతి  Mari gold, Botanical name: Tagetus patula దీన్ని గొబ్బెమ్మలు , బతుకమ్మల ను అలంకరించడానికి వాడతారు ; పురాతన గ్రంధాలలో దీని ప్రస్తావన లేదు. 
తంగేడు, గురుగు, గుమ్మడి , బీర ,  పూలను ప్రధానం గా బతుకమ్మ(తెలంగాణాలో  ) పూజించడానికి , గొబ్బెమ్మలను(ఆంధ్ర లో ) పూజించడానికి వాడతారు.
తంగేడు /బతుకమ్మ పూలు 
సీతమ్మ జడలు 
గురుగు పూలు 
గుమ్మడి పూవు 
వీటిని కూడా గుమ్మడి పూవు అంటారు. ఇది పొద 
బీర పూలు 
పూలనే కాకుండా పత్రాలను, మొక్కల నుండి లభించే జిగురు మొదలయినవి కూడా పూజకు ఉపయోగిస్తారు.
మామిడి ఆకు లేనిదే శుభ కార్యము జరుగదు . కలశ నిర్మాణము లో వాడతారు.  
1.బిల్వ (మారేడు )వాటిలో  శివునికి బిల్వ (మారేడు ) దళాలను వాడతారు.శైలూషము,శాండిల్యము, శ్రీఫలము అనికూడా పేర్లు. దీని Botanical name: Aegle marmelos (L.)Corrêa.కొన్ని ప్రదేశములలో మూడు దళములు గల వరుణ వృక్షాన్ని మారేడు కు మారుగా శివారాధనకు వాడతారు. దీని శాస్త్రియ నామము Crateva religiosa ,దీన్ని వుసిక మాను, ఉలిమిరి అని కూడా అంటారు  
 2. తులసి: Botanical name: Ocimum tenuiflorum Syn. Ocimum sanctum. భారత దేశములో తులసి మొక్క గురించి తెలియని వారుండరు.బృంద,కృష్ణతులసి/నల్లతులసి,లక్ష్మి తులసి/తెల్లతులసి,అని కూడా అంటారు. కుక్క తులసి తప్ప మిగిలినవి పూజకు వాడ వచ్చు. ఇవి విష్ణు పూజకు , ప్రశస్తము. తులసి దళాలు వేసిన నీరు కఫ హరము. 
3.  మరువకము,Origanum majorana L., దవనమును Artemisia pallens Wall. ex. DC.,  కూడా పూజ కు వాడుతారు. ఇవి సుగంధ భరితము.    
4.నాగవల్లి/ తమల పాకు: Botanical name: Piper betel పార్వతి, కాళిక లను "నాగవల్లీరసవాసినీ" అని వర్ణించారు. తమలపాకులను హనుమంతుని పూజకు వాడడం అందరికీ తెలిసినదే.
5. గరిక : Botanical name: Cynodon dactylon; దీన్ని విఘ్నేశ్వరునిపూజకు వాడతారు. 
6. దర్భ గడ్డి : Botanical name: Desmostachya bipinnata, దీన్ని కుశ అని కూడా అంటారు జపము , యజ్ఞము మొదలైన క్రతువులలో దీన్ని వాడతారు.      
7. చందనము  /శ్రీగంధము: Botanical name: Santalum album, కలపను అరగదీసి చేసే ముద్దను గంధము అంటారు. ఇది భగవంతుని కి లేపనం గా వాడతారు.     
8. ధూపము: Botanical name:  Boswellia serrata Roxb. ex Colebr., గుగ్గిలం, పరంగి సాంబ్రాణి, అందుగ: ఈ చెట్టు నుండి వచ్చే జిగురు పదార్ధము నుగుగ్గిలం అంటారు
Agaru :అగరు Aquillaria agallocha ఈ చెట్టు నుండి లభించే జిగురు ను అగరు  అంటారు.
సాంబ్రాణి  Styrax benzoin అనే చెట్టు నుండి లభించే జిగురు. ఈ  రెండు చెట్లు మన దేశంలో సాధారణంగా వుండవు. వీటితో శివారాధన సమయం లో ధూపం వేస్తారు.     
9. కర్పూరముBotanical name:  Cinnamomum camphora ఈ చెట్టుఆకులు, కలప నుండి కర్పూరము ను సంగ్రహిస్తారు. దీన్ని అభిషేకజలములో, తాంబూలము లో నివేదనకు ఉపయోగిస్తారు. 
11. రుద్రాక్ష : Botanical name:Elaeocarpus ganitrus,  ఈ చెట్టు విత్తనాలనురుద్రాక్షలు అంటారు. రుద్రుని(శివుని )కన్నీటి చుక్క నుండి మొలిచిన చెట్టు గా ప్రసిద్ధి . వీటిని మాలలు గా చేసి జపానికి , శివుని పూజకు ఉపయోగిస్తారు.     
10. చెఱుకు : దీనిని రసాలము అని కూడా అంటారు.Botanical name: Saccharum officinarum,.మన్మధుని విల్లు చెరకుగడ , పార్వతి చేతిలోనూ చెరకుగడ ఉంటుంది.
అరటి పిలకలు, మామిడాకుల తోరణాలు, అరటి ఆకులు   శుభ కార్యాల్లో తప్పని సరిగా ఉండాల్సిందే.  
Sacred trees: పవిత్రమైన వృక్షాలు 
1. మర్రి /వట వృక్షము : Ficus benghalensis; It is considered as sacred. Lord Shiva in the form of Dakshina murthy said to be seated under the tree for meditation. Vaishnavites believe that lord Krishna lies on the leaf. 
2. రావి /అశ్వథ వృక్షము :  Ficus religiosa : Hindus consider this tree as incarnation of Lord Vishnu (As per Bhagavdgita); It is worshiped  as God. A peepal tree and a neem tree are planted together and consider them as lord Vishnu and goddess Laksmi. Some consider this tree as manifestation of Brahma (base), lord Vishnu (middle part, top as lord Shiva.   

 చివరగా ఒక మాట: శంకర భగవత్పాదుల శివానంద లహరి లో ని ఈ శ్లోకం చదవండి   
గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే 
విశాలే శైలే  చ  భ్రమతి కుసుమార్ధం జడ మతి 
సమార్పైకం చేతస్సరసిజం ఉమానాథ భవేత్ 
సుఖేనా వ స్థాతుం  జన ఇహ న జానాతి కి మ హో 
అర్ధము: ఓ ఉమా నాథుడా (శివుడా ) మంద బుద్ధి గల వారే నీ పూజా పుష్పాల కొరకు లోతైన చెరువుల్లో, జన సంచారం లేని ప్రమాద కరమైన అడవుల్లో, విశాల మైన కొండల్లో తిరుగుతాడు. కానీ హృదయ సరోవరం లో పూచిన ఒక పద్మాన్ని నీకు సమర్పిస్తే వున్న చోటే సుఖం గా ఉండ వచ్చ్చని ఈ ప్రజలకు తెలియ దంటే విచిత్రం గా వుంది . ఈ పూల న్నిటి కన్నా హృదయ పద్మమే భగవంతునికి ప్రీతి కరము అని భావము .
పద్మశ్రీ పొందిన ధర్పల్లి (చెట్ల)రామయ్య  కు కోటి నమస్కారములు; ఎవరో పెంచిన చెట్ల నుండి కోటి పూలు తెఛ్చి దేవుడిని పూజించుట కన్నా మనం కనీసం ఒక చెట్టయినా నాటి తే  కోటి పూల తో పూజ చేసిన ఫలం వస్తుంది. ఇది సత్యము.